Sep 23,2023 20:07

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన చలో విజయవాడలో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని అంగన్‌వాడీల జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల రూరల్‌ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. పని భారం పెరిగిందని, సెంటర్‌ అద్దె, కరెంట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సెక్టార్‌ నాయకులు ఎం.జ్యోతి, టి.లక్ష్మి, పి.రాధా జయలక్ష్మి, ఎం.రాజకుమారి, కె.వరహాలు, ఎం.ప్రభావతి, పివి.లక్ష్మి, యు.సత్యశ్రీ, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, ఎ.అజరుకుమారి పాల్గొన్నారు.