Sep 21,2023 21:01

సమావేశంలో మాట్లాడుతున్న యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

కడప అర్బన్‌ : జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కూరగాయల బిల్లులు, గ్యాస్‌ బిల్లులు, ఆరు నెలల నుంచి పెండింగ్‌ ఉన్న సెంటర్‌ అద్దె బిల్లులు, నాలుగు సంవత్సరాల నుంచి టిఎ, డిఎ బిల్లులు తక్షణమే చెల్లించకపోతే రానున్న కాలంలో రాష్ట్రస్థాయిలో ఆందోళన, పోరా టాలకు శ్రీకారం చుడుతామని ఆంధ్రప్రదేశ్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి తెలిపారు. గురువారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 13 ప్రాజెక్టులున్నాయని చెప్పారు. చాలా సమస్యలతో అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్స్‌, మినీ వర్కర్స్‌ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. జీతాలు సరిగ్గా రానటువంటి పరిస్థితి నెల కొందన్నారు. కూరగాయల, గ్యాస్‌ బిల్లులు, సెంటర్‌ అద్దెలు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలచే అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారని విమ ర్శించారు. సమస్యలను ఎందుకు పరిష్కరించరని ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. అంగన్వాడీ కార్యకర్తలు అప్పులు తెచ్చి సెంటర్లు నడుపు తున్నారని చెప్పారు. 2017 నుంచి టిఎ, డిఎలు ఇవ్వడం లేదని తెలిపారు. నెలలో రెండు మూడు సార్లు మీటింగ్‌లకు పిలుస్తున్నారని, ఫ్రీ స్కూలు కిట్టు, రిజిస్టర్లు, యూనిఫామ్‌ తామే తెచ్చుకోవడంలో ఆటో ఛార్జీలు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఒక్కో సెంటర్‌లో బియ్యం, 300 నుంచి 400 కిలోలు నిల్వ ఉన్నాయని, కందిపప్పు స్టాకు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అయినా ప్రతి నెలా కొత్తగా బియ్యం, కందిపప్పు, నూనె సప్లరు చేస్తున్నారని దీనివల్ల పాత స్టాకు పురుగు పడుతోందని తెలిపారు. చాలా ప్రాజెక్టులలో 2017 సంవత్సరం నుంచి వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రాలేదని తెలిపారు. వెంటనే పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కడప అర్బన్‌ ప్రాజెక్ట్‌ నాయకురాలు శాంతి, ఎర్రగుంట్ల మండల నాయకురాలు పి. ఉమాదేవి పాల్గొన్నారు.