ప్రజాశక్తి పెదబయలు రూరల్ :మండలంలో 23 గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న అంగనవాడి వర్కర్స్, హెల్పర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మండలం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులు బొండా సన్ని బాబు మాట్లాడుతూ, గత ఎన్నో ఏళ్లగా పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గ్రాడ్యువిటీ చెల్లించటం లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించ లేదన్నారు.ఉద్యోగ భద్రత, పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, గ్రాడ్యువిటీ, పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కిల్లో సర్బన్న, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు టి.రాజమ్మ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.










