Aug 16,2023 21:57

ఎమ్మెల్యేకి వినతి పత్రం అందిస్తున్న అంగన్వాడీలు

ప్రజాశక్తి-పాలకొండ :  అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వి.కళావతికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ మాదిరిగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అందించాలని కోరారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఐదు లక్షలు, వేతనంలో సగం పింఛను ఇవ్వాలని, అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమప్రభ, జిల్లా కోశాధికారి బి.అమరవేణి, నాయకులు జి.జెస్సిబాయి, ఎ.పార్వతి, కె.అరుణ, ఆర్‌.భవాని పాల్గొన్నారు.