పెదకూరపాడు: ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీల సమ స్యలపై క్రోసూరు ప్రాజెక్ట్ సిడిపిఒ స్వర్ణకుమారికి శనివారం డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని అందజేశారు. ఈ నెల 25వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద సిఐటియు , ఏఐటియుసి, ఐఎఫ్‌టియు మూడు సంఘాల ఆధ్వ ర్యంలో జరుగుతున్న సామూహిక దీక్షలో పాల్గొననున్నట్టు వారు చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి జయ లక్ష్మి, అధ్యక్షులు శివపార్వతి, అంగన్వాడి కార్యకర్తలు, ప్రజా సం ఘాల నాయకులు టి.హనుమంతరావు పాల్గొన్నారు. నాదెండ్ల: ఈ నెల 25వ తేదీన విజయవాడలో జరగబోయే సభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నాదెండ్ల సిడిపిఒకు సమ్మె నోటీసును అందజేశారు. అంగ న్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాడ్యూటి అమలు చేయా లని, అంగన్వాడి వర్కర్స్ మినీ హెల్పర్స్ కనీస వేతనాలు చెల్లించాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని,తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీని అమలు చేయాలి ,రాష్ట్రంలో ఉన్న మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని మొదలైన డిమాండ్లు చేశారు. సమ్మె నోటీసును అందజేసిన వారిలో పేరుబోయిన వెంకటేశ్వర్లు, అంగన్వాడి డివిజన్ అధ్యక్షులు సావిత్రి పాల్గొన్నారు.










