Mar 20,2023 20:23

ఆత్మకూరు : ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

ప్రజాశక్తి - విలేకరులు
ఆత్మకూర్‌ :
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిఐటియు పట్టణ కార్యదర్శి రామ్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు రణధీర్‌, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు వెంకటలక్ష్మి, లక్ష్మీదేవి, ప్రమీలమ్మలు అన్నారు. చలో విజయవాడకు వెళ్లకుండా అంగన్వాడీ వర్కర్ల అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు ఆధ్వరయంలో సోమవారం పట్టణంలోని బస్టాండ్‌ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు పెంచి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను దూరం చేశారన్నారు. రకరకాల యాప్‌ లతో అంగన్వాడీలపై పని బారాన్ని పెంచి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నా రు. జీవో నెంబర్‌ 1 తీసుకువచ్చి ప్రజలకు నిరసన తెలియజేసే హక్కును హరిస్తున్నారన్నారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం చర్చించి వాటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు విజయలక్ష్మి, చంద్రకళ, అరుణ, ప్రియాంక,అనసూయ, శ్రీదేవి, రవణమ్మ, రమాదేవి, సిఐటియు నాయకులు సురేంద్ర, మాబాష, గణపతి, మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : అంగన్వాడిల సమస్యలను పరిష్కారం చేయకుండా అక్రమ అరెస్టులు చేయడం దారుణం అని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కొత్తపల్లి మండల నాయకు రాళ్లు శ్రీదేవి, నాగమణి, మంజులమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా కొత్తపల్లి తాసిల్దార్‌ కార్యాలయం ముందు యూనియన్‌ నాయకత్వం ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్‌ పెద్దన్న కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి, కృష్ణ, వేణమ్మ, శేషమ్మ, మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు. బేతంచెర్ల : అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేయడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై.ఎల్లయ్య, సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఆర్‌. ఈశ్వరయ్య,సిఐటియు సీనియర్‌ నాయకులులు జి. వేణుగోపాల్‌ పేర్కొన్నారు. బేతంచర్ల పట్టణంలోని పాత బస్టాండ్‌ సర్కిల్‌ నందు అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షురాలు వైఎస్‌.గుల్జార్‌ బీ అధ్యక్షతన రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు సంతోషమ్మ, నారాయణమ్మ,తులసి, లక్ష్మీదేవి, శివలక్ష్మి, పద్మావతి, నరసమ్మ,విజయమని, నాగేంద్రమ్మ,రమణమ్మ ఆశ వర్కర్లు నాగేంద్రమ్మ రమణమ్మ సిఐటియు నాయకులు రాజబాబు, రామకృష్ణ, తదితరులులు పాల్గొన్నారు. వెలుగోడు : మండలంలో సిఐటియు కార్యాలయం వద్ద నుండి తహాశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు హెల్పర్లు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. సిఐటియు కార్యదర్శి తాళ్ల శ్రీనివాసులు, సిఐటియు అధ్యక్షులు నాగ మోహన్‌, సిఐటియు ఉపాధ్యక్షులు మహమ్మద్‌ రఫీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గౌరీ, జి రామతులసమ్మ, జి శ్యామలమ్మ, ఎన్‌ నాగ లచ్చమ్మ, కే శోభారాణి, ఎం మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.