ప్రజాశక్తి - ఏలూరు
జిల్లాలో ఇటీవల ఐసిడిఎస్ పరిధిలో చేసిన మార్పులు, చేర్పుల వల్ల వివిధ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ వర్కర్లు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కారం చేసేందుకు ఈ క్రింది విధంగా చర్యలు చేపట్టాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఐసిడిఎస్ పీడీ కె.పద్మావతికి వినతిపత్రం సమర్పించారు. మండవల్లి ప్రాజెక్టును పాత పద్ధతిలోనే కొనసాగించాలని, పోలవరం మండలాన్ని కొయ్యలగూడెం ప్రాజెక్టులో కలపాలని, జీలుగుమిల్లి మండలాన్ని బుట్టాయగూడెం ప్రాజెక్టులో కలపాలని వినతిలో కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.విజయలక్ష్మి, ఆయా ప్రాజెక్టుల నాయకులు కె.చెల్లాయమ్మ, సిహెచ్.వాణి, ఎం.రాణి, పి.విజయలక్ష్మి, కె.ప్రసన్న కుమారి ఉన్నారు.










