ప్రజాశక్తి-బాపట్ల రూరల్ : టంగుటూరులో మండలం రావివారిపాలెం గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తను ట్రాక్టర్‌తో ఢకొీట్టి హత్య చేయడాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాపట్లలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ హను మాయమ్మను ట్రాక్టర్‌తో ఢకొీట్టి హత్య చేసిన కొండలరావును కఠినంగా శిక్షించాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్సగ్రేషియా ఇవ్వాలన్నారు. మృతుడి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. జిల్లా అధ్యక్షుడు ఝాన్సీ మాట్లాడుతూ అంగన్‌వాడీలను మానసిక ఒత్తిడికి గురిచేయడం తగదన్నారు. అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు అరికట్టాలన్నారు. మహిళా క్రీడాకారులను శారీరకంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు..అనంతరం ఐసిడిఎస్ పీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శైలజ, హేమ, శేషు, మేరీ, రాణి తదితరులు పాల్గొన్నారు.










