ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు మండల కార్యదర్శి కె శంకర్‌రావు ఆధ్వర్యాన అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు తక్షణమే నెర వేర్చాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకండా పని బారం పెంచిందన్నారు. మొబైల్ యాప్లులతో మరింత ఒత్తిడి తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, టిఎ, డిఎలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.అంగన్వాడీ లను కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు.ప్రభుత్వ అధికారుల వేదింపులు ఆపి, మొబైల్ ఫేషియల్ అటెండెన్స్ ఎత్తివేయాలన్నారు.ఫిబ్రవరి 6న చలో పాడేరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపట్టేందుకు కార్మికులు ఏకం కావాలని కోరారు. తఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాథ్, పి.బిమ్మన, సిఐటియు మండల కమిటీ సభ్యులు పి.బీమరాజు అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










