Jun 16,2023 00:31

పాడేరులో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి-పాడేరు:తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం పాడేరు, చింతపల్లి మండల కేంద్రాల్లో ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నయ్య పడాల్‌, జిల్లా కమిటీ సభ్యులు సుందరరావు, .అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు ,కుమారి, చాయిదేవి మాట్లాడుతూ, అంగన్వాడీలకు గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలన్నారు. వేతనంలో సగం పెన్షన్‌ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరా లకు పెంచాలని,. ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు.. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు.వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్స్‌, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు, 2017 నుండి పెండింగ్‌ లో ఉన్న బిల్లులు, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలన్నారు.
డుంబ్రిగుడ: దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద గురువారం అంగన్వాడి టీచర్లు ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆ సంఘం మండల అధ్యక్షురాలు కే.కొండమ్మ మాట్లాడుతూ, వేతనాలతో కూడిన మెడికల్‌ లీవ్‌ కల్పించాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబానికి ఉద్యోగం కల్పించాలన్నారు.రిటర్మెంట్‌ బెనిఫిట్‌ రూ 5 లక్షలు చెల్లించి, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి సత్యావతి, నాయకులు, జి.పవిత్ర, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
చింతూరు:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా చింతూరు ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్‌ మాట్లాడుతు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పింఛను, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాడ్యూటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐసిడిఎస్‌ పిఒకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పార్వతి, కామేశ్వరి, పొద్దమ్మ, అంగన్వాడీలు పాల్గొన్నారు.
విఆర్‌.పురం : మండలంలోని రేఖపల్లి ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి, పిఒకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు రంగమ్మ, కారం సుజాత, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను అనేక రెట్లు పెరిగాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదని పేర్కొన్నారు. 2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరించకుంటే జులై 10, 11 తేదీల్లో కలెక్టర్‌ కార్యాలయాల వద్ద నిరవధిక ఆందోళనలు చేస్తున్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాధ, సోడే కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : అంగన్వాడీ యూనియన్‌ జిల్లా నాయకురాలు ఎ.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలను రెగ్యులర్‌ ఉద్యోగులు వలే గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్‌ నాయకులు రమణి, సత్యవతి, కుమారి, రత్నం, మేరి, సుందరమ్మ, రాజేశ్వరి, లక్ష్మీ, సత్యవతి, మంగమ్మ, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.