Aug 29,2023 22:24

ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు, నాయకులు

ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : అంగన్వాడీల అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీి వర్కర్ల అక్రమ తొలగింపులు ఆపాలని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ క్రాస్‌ వద్ద ఉన్న సిడిపిఒ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భగా అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు మాబున్నీసా, సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. నల్లమాడ మండలం బడావండ్లపల్లి గ్రామం లో మినీ అంగన్వాడీ వర్కర్‌ గా ఎం.కిరణమ్మ 8 సంవత్సరాలుగా పనిచేస్తోందన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆమెను తొలగించారని విమర్శించారు. కోర్టుకు వెళ్లి స్టే తీసుకొని వచ్చి రెండు సంవత్సరాలు పనిచేస్తే కొన్ని నెలలు వేతనం ఇచ్చి ఆ తర్వాత ఇవ్వటం లేదన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, ఆమెకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమణ, మండల అధ్యక్షులు కుళ్లాయప్ప, మండల కార్యదర్శి శ్రీరాములు, అంగన్వాడీయూనియన్‌ నాయకులు మణిమాల తదితరులు పాల్గొన్నారు.