Jul 11,2023 22:07

అంగన్వాడీలనుద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఎ. గఫూర్‌

కడప అర్బన్‌ : అంగన్‌వాడీల ఆగ్రహానికి గురైన ఏ ప్రభుత్వమైనా కూలక తప్పదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఎ.గఫూర్‌ హెచ్చరించారు. మంగ ళవారం ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 36 గంటల నిరసన ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించి, సమస్యలు పరిష్కరించకుండా వేధింపులకు గురిచేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అంగన్‌వాడీలు గత ఎన్నికల్లో కూల్చి వేశారని గుర్తు చేశారు. 'బాబు'కు పట్టిన గతే సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి పట్టకూడదంటే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని పేర్కొన్నారు. తెలంగాణా కంటే మెరుగా రూ.14, 500 ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. గుజ రాత్‌లో అంగన్‌వాడీలు రిటైర్ట్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వా లని హైకోర్టులో కేసువేశారన్నారు. గ్య్రాడ్యూట్‌ అమలు చేయమంటే ఇవ్వమని అనడం అంగన్‌వాడీల హక్కు లను కాలరాయడమే అన్నారు. రిటైర్డ్‌ అయిన తరు వాత పెన్షన్‌ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇచ్చే రూ.10వేల వేతనానికే స్వర్గం అంటే ఎంఎల్‌ఎలు, మంత్రులకు ఇస్తున్న లక్షల జీతాలను ఏమనాలని ప్రశ్నించారు. జగన్‌ అధికారంలోకి రావాలని ఎంతో మంది అంగన్‌వాడీలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. అంగన్‌వాడీల ఓటు ఒక్కటి కాదని, మురికివాడల్లో ప్రజలతో మమేకమైన వీరికి 200 ఓటర్లు తెలిసి ఉంటారని, లక్షమంది 2కోట్లు ఓట్లును ప్రభావితం చేయగలరని హెచ్చరించారు. సిఎం జగన్‌ గర్భగుడిలో విగ్రహంగా ఉన్నాడని, ఎన్నికలకు ఇక 6 నెలల సమయం ఉందని, ఒకసరి లోచించాలని చెప్పా రు. చర్చల సందర్భంగా వేతనాలు ఒక్కటి అడగవద్దు అంటున్నారని, పెరిగిన ధరలను బట్టి వేతనాలు పెంచకుంటే ఎలా అని ప్రశ్నించారు. పని, యాప్‌ల భారం ఎక్కువైపోయిందని, నాలుగున్నర సంవ త్సరస్త్రలో ఒక్క రూపాయి జీతం పెంచలేదని విమర్శి ంచారు. తెలంగాణా సిఎం కెసిఆర్‌ అక్కడి వారికి పెంచారని గుర్తు చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి ఫలితం లేకపోవడంతో 36 గంటల నిరసన చేపట్టారని పేర్కొన్నారు. సెంటర్లకు రానివారి ఫొటోలు తీసి పెట్టండి అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఏమి చేస్తారో తామూ చూస్తామని హెచ్చరించారు. వివిధ కార్మిక సంఘాల మద్దతులో ఆందోళనలు మరింత ఉధృతం చేయకతప్పదని పేర్కొన్నారు. విజయవాడలో మహాధర్నా చేపడతామని తెలిపారు. ఫుట్‌ పాత్‌పై ఉన్న అంగన్‌వాడీలు తలుచుకుంటే సిఎం జగన్‌ను ఫుట్‌పాత్‌ పైకి లాగేస్తారని హెచ్చరించారు. సంక్షేమ పథకాలను వీరికి వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాలను పోలీసులతో అణిచివేయవచ్చు అనుకునే జగన్‌కు 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ది చెబుతారని తెలిపారు.
ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.లక్ష్మిదేవి, బి.లక్ష్మిదేవి, కోశాధికారి అంజనీదేవి, సిఐటియు జిల్లా, నగర ప్రధాన కార్యదర్శులు బి.మనోహర్‌, వెంకటసుబ్బయ్య, నాయకులు సత్యం, ఎల్‌ఐసి యూనియన్‌ డివిజన్‌ కార్యదర్శి ఎ.రఘు నాథరెడ్డి, యుఇఇయు నాయకులు శివశంకర్‌, సుద ర్శన్‌రెడ్డి, కార్యకర్తలు, ఆయాలు ప్రసంగించారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, బైరవ ప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.ఆర్‌. నాయక్‌, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.