Jul 09,2023 21:17

అంగన్వాడీల 36 గంటల ధర్నాను జయప్రదం చేయండి

కడప అర్బన్‌ : అంగన్వాడీ వర్కర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయా లని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ పిలుప ునిచ్చారు. ఆదివారం సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు అంగ న్వాడీలకు పెంచుతానని హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ కన్నా రెండు వేల రూపాయలు తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పనికి తగ్గ వేతనం, కనీసం రూ .26 వేల వేతనం, గ్రాటిటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 400 జనాభా దాటిన మినీ వర్కర్స్‌ను మెయిన్‌ వర్కర్స్‌గా మార్చాలి అన్నారు. అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలను వర్తిం పజేయాలన్నారు. ఆయాలకు ప్రమోషన్ల కోసం వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని కోరారు. అర్హులైన అంగన్వాడీ లందరికీ సూపర్‌వైజర్లగా ఉద్యోగోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. వర్కర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై రేపు జరగబోయే ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటి యు జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసులు రెడ్డి, అంగ న్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.లక్ష్మీదేవి, ఆర్‌.లక్ష్మీదేవి, జిల్లా ట్రెజరర్‌ అంజలీదేవి పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడతున్న మనోహర్‌