అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించండి - సిఐటియు
ప్రజాశక్తి - నంద్యాల
అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నంద్యాల జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు శోభా రాణి అధ్యక్షతన నంద్యాల సిఐటియు కార్యాలయంలో మంగళవారం జరిగినది. ఈ సమావేశంలో సిఐటియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వి. యేసు రత్నం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నిర్మలమ్మ మాట్లాడుతూ రెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అలాగే కూరగాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెంటర్అద్దెలు రాక అంగన్వాడి వర్కర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ప్రభుత్వం సెంటర్ అద్దెలు ఇవ్వాలని కోరారు. అంగన్వాడి సెంటర్ కు సరఫరా చేసే రేషన్ సరుకులను కేంద్రానికి ప్రభుత్వమే సరఫరా చేయాలని,పిల్లల ఆధార్ తీయించడానికి అంగన్వాడి వర్కర్ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ సచివాలయాలు చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు . పుట్టిన సర్టిఫికెట్ లేకపోవడం ఆధార్ను తీర్చలేక పోతున్నారు. ప్రభుత్వం ఆధార సమస్యను సచివాలయ ఉద్యోగులకు అప్పగించాలని వారు కోరారు. సచివాలయ సిబ్బంది వారానికి ఒకసారి అంగన్వాడి సెంటర్ ను చేయాల్సి ఉంది కానీ సచివాలయ సిబ్బంది విసిట్ చేయకపోతే పనిష్మెంట్ అంగన్వాడి వర్కర్ ఇస్తున్నారు . ఇది అంగన్వాడి వర్కర్స్ కు సంబంధం లేని విషయం కాబట్టి పనిష్మెంట్ అంగన్వాడి వర్కర్ కు ఇవ్వరాదు దీనినీ యూనియన్ గా ఖండిస్తున్నాం అన్నారు.పిల్లలను కొలిచే ఎత్తులు బరువుల పరికరాలు అంగన్వాడి కేంద్రంలో పనిచేయడం లేదు కాబట్టి వెంటనే కొత్త పరికరాలు ఇవ్వాలని,హౌస్ రెంటు కరెంటు బిల్లులు కూరగాయల బిల్లులు వేతనాలు ప్రతినెలా రెగ్యులర్గా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో కొత్తగా మంజూరైన బిల్డింగులను నాడు నేడు కింద మదర్స్ కమిటీ వేసి వాటి చెక్కుల కోసమని వాటి నిర్మాణం కోసమని అంగన్వాడీ కార్యకర్తలను పలుమార్లు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు . నాడు నేడు బిల్డింగులను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. కాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి అంగన్వాడి వర్కర్ల పైన పని భారాన్ని తగ్గించాలని, అర్హులైన మినీ అంగన్వాడి ఆయాలకు వెంటనే ప్రమోషన్ ఇచ్చి పనిభారాన్ని తగ్గించాలని,కొత్తగా చేరిన అంగన్వాడి వర్కర్స్ కు ఆయాలకు వెంటనే టంబ్ లను జత చేయాలని,. టంబ్ లు వేయడానికి స్కానర్ లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు . మిల్క్ మిల్క్ తంబుకు అంగన్వాడి వర్కర్ తో పాటు ఆయాలను కూడా జత చేయాలి. అంగన్వాడీ సెంటర్లలో మౌలిక సదుపాయాలు లేవు వెంటనే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వర్తింపజేయడం కోసం అంగన్వాడి వర్కర్లకు అదేపనిగా ఆఫీసుల చుట్టూ తిప్పడం వల్ల ఎక్సెల్ ఎక్కియడము జిరాక్స్ ఆటో చార్జీలు బస్సు చార్జీలు కోసం అంగన్వాడి ఒక్కొక్కరు నెలలకు ఐదు వందల రూపాయల దగ్గర ఖర్చు పెడుతున్నారన్నారు . ఈ అమౌంట్ను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. రిటైర్ అయిన అంగన్వాడి వర్కర్ అండ్ హెల్పరులకు వర్తింపజేసి పెన్షన్ ఇవ్వాలి. వైయస్సార్ ప్రభుత్వము పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడి వర్కర్స్ కు కనీస వేతనం అమలు చేయాలి. మెనూ చార్జీలు పెంచాలి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రాయవారిపల్లె అంగన్వాడి వర్కర్ హనుమంతయమ్మ ను ట్రాక్టర్ తో గుద్ది చంపిన వైసీపీ నాయకుడు కొండలరావును వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని హనుమంతయమ్మ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సమావేశంలో వెంకటలక్ష్మి, డి నిర్మలమ్మ, సునీత,నాగరాణి, హరితమ్మ,భాగ్యమ్మ, శ్రీదేవి, నాగలక్ష్మి, సావిత్రి, రేణుక, సుశీలమ్మ, మదర్ బి, తదితరులు పాల్గొన్నారు.










