అంగన్‌వాడీ టీచర్‌ను సత్కరిస్తున్న సహోద్యోగులు
ప్రజాశక్తి-వేటపాలెం: దేశాయిపేట అంగన్‌వాడీ సెక్టార్‌లో అంగన్‌వాడీ టీచర్ ఏ శివనాగేంద్రం సేవలు కొనియాడదగిన వని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఏ శివ నాగేంద్రానికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అంగన్‌వాడీ టీచర్లు మాట్లాడుతూ శివ నాగేంద్రం సేవలను ప్రశంసించారు. ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. తనకు వీడ్కోలు పలికిన అందరికీ శివ నాగేంద్రం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ లీలావతి, అంగన్‌వాడీ కార్యకర్తలు శిరోమణి, వరలక్ష్మి, రమదేవి, కమలకుమారి, పూర్ణిమ, ఉష, బ్యులా, సుప్రియ, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు.










