ప్రజాశక్తి - ఆదోని
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.ఈరన్న, ఎఐటియుసి పట్టణ నాయకులు టి.వీరేష్ కోరారు. సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో సిడిపిఒ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న, ఎఐటియుసి పట్టణ నాయకులు వీరేష్, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్, అంగన్వాడీ యూనియన్ నాయకులు వరలక్ష్మి, జానకి మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. పింఛను జీతంలో 50 శాతం ఇవ్వాలని, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. సూపర్‌వైజర్ ప్రమోషన్‌కు 50 ఏళ్లు పెంచాలని, సర్వీసులో చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. రిటైర్‌మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, వేతనంతో కూడిన లీవ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మెనూ చార్జీలను పెంచాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ అద్దెలు, టిఎ బిల్లులు ఇవ్వాలని, ఫేస్ యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. అనంతరం కార్యాలయ అధికారి శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్లు పద్మ, రేణుక, సరోజ, వీరమ్మ, మీనా కుమారి, రిజ్వానా పాల్గొన్నారు. ఎమ్మిగనూరులోని సిడిపిఒ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి గోవర్ధనమ్మ, సిఐటియు మండల అధ్యక్షులు సి.గోవిందు, బి.రాముడు మాట్లాడారు. సర్వీసులో చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, వేతనంతో కూడిన లీవ్ సౌకర్యం కల్పించాలని, మెనూ ఛార్జీలను పెంచాలని కోరారు. ఎన్నికల ముందు జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. లేకపోతే డిసెంబర్ 8 నుంచి అంగన్వాడీ కేంద్రాలను బంద్ పాటించి సమ్మెకు వెళ్తున్నట్లు నోటీస్ అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ బాధ్యులు నాగేశ్వరమ్మ, పద్మ, శైలజ, అరుణ, నీరజ, లక్ష్మి, నాగలక్ష్మి, లత, రాణి, పుష్ప, మల్లేశ్వరి, మున్నీ, తులసి, హేమలత, ప్రభావతి, మేరీ, పద్మ, ప్రమీల, వరలక్ష్మి, జైతున్, సిఐటియు నాయకులు పి.రాజు పాల్గొన్నారు.