Jul 04,2023 00:26

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:ఐసిడియస్‌ పరిరక్షణ, అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ఈనెల 10, 11తేదీలలో జరిగే నిరసనలను జయప్రదం చేయాలని ఎపి అంగ్‌వాడి వర్కర్స్‌ హెల్పర్స్‌ (యూనియన్‌ సిఐటియు )జిల్లా ప్రదాన కార్యదర్శి ఎం.నాగశేషు పిలుపునిచ్చారు. నర్సీపట్నం పాత మున్సిపల్‌ కార్యాలయ సమీపంలో సోమవారం యూనియన్‌ సమవేశం నిర్వహించారు. పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎం.నాగశేషు మాట్లాడుతూ, ఐసిడియస్‌లకు రానురాను కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా నిధులు కేటాయింపులు చేయలేదన్నారు. ఉద్యోగ విరమణ సదుపాయం, పెన్షన్‌, ఫీఎప్‌, ఇఎస్‌ఐలు అమలు చేయలేదన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్‌ నాయకులు వి.సామ్రాజ్యం, బ్రమరాంబ, మంగ, పద్మజ, సత్యవతి, వసంత, రాజేశ్వరి, వరలక్ష్మి పాల్గొన్నారు.