Aug 26,2023 21:58

వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
అంగన్‌వాడీ సమస్యలపై
అసెంబ్లీలో ప్రశ్నించండి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ :అంగన్‌వాడీ సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని కోరుతూ శనివారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిని ఆయన ఇంటి వద్ద కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు మాట్లాడుతూ
అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కనీస వేతనం పెన్షన్‌, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని కోరారు.ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు అనేకసార్లు పెంచారని. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచలేదన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని మన ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.
తెలంగాణలో వర్కర్లకు 1,3650, హెల్పర్‌, మినీ వర్కర్లకు 7,800 వేతనం ఇస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని తెలిపారు.అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకా
లు అంగన్వాడీ వర్కర్లకు ఇవ్వడం లేదన్నారు. అంగన్వాడి సెంటర్ల నిర్వహణకు అంగన్వాడీలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
ప్రతి నెలా 5వ తేదీనే జీతాలు, బిల్లులు ఇవ్వాలన్నారు.
2017 నుంచి డీఏ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదన్నారు.
రిటర్మెంట్‌ బెనిఫిట్‌ కల్పించి వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేయాలని,
300 జనాభా దాటిన అంగన్వాడి మినీ సెంటర్‌ లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. పిల్లలకి యూనిఫామ్‌, అమ్మఒడి అమలు చేయాలన్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, వంట గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని, పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్లు విజయలత ,రమాదేవి, సుశీల, శివలీల ,కామేశ్వరి, జ్యోతి, దీనకుమారి పాల్గొన్నారు.