ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
చింతూరు ఐటిడిఎ పరిధి, కూనవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న ఒక్క అంగన్వాడీ హెల్పరు, ఒక్క అంగన్వాడీ వర్కర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తెలిపారు. అంగన్వాడీ హెల్పర్ పోస్టుకి ఒక దరఖాస్తు, వర్కర్ పోస్టుకు 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వారికి జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎడియం అండ్ హెచ్‌ఓ, సిడిపిఓలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సూర్య లక్ష్మి, ఎడియం అండ్ హెచ్‌ఓ డాక్టర్ అనూష, సిడిపిఓ పిఒలు విమల, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.










