ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఆర్‌డిఒ భాస్కరరెడ్డి
ప్రజాశక్తి- భీమునిపట్నం : అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు బుధవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆర్‌డిఒ ఎస్.భాస్కరరెడ్డి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరి, ఐసిడిఎస్ పిఒ ఎంశ్రీదేవి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 9కి గాను 25 మంది, 25 సహాయకుల పోస్టులకు 53 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీగా ఉన్న ఒకే ఒక్క మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టు కు ఏ ఒక్కరూ దరఖాస్తు చేయలేదు.










