Sep 22,2023 21:48

ఫొటో : వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్‌ అన్వేష్‌

అంగన్‌వాడీ పిల్లలకు వైద్య పరీక్షలు
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు శుక్రవారం ప్రత్యేక చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ అన్వేష్‌, వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయసుకు తగ్గ బరువు, ఎత్తు, లేని 11మంది పిల్లలను గుర్తించి వారికి స్కానింగ్‌ చేసినట్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు కేంద్రానికి వచ్చే పిల్లల బరువు, ఎత్తులు ప్రతినెలా చూసి రికార్డులలో నమోదు చేయాలన్నారు.
కార్యక్రమంలో ఉదయగిరి అంగన్‌వాడీ సిడిపిఒ పచ్చవ లావణ్య, పిహెచ్‌ఎన్‌.సుశీలమ్మ, తదితరులు పాల్గొన్నారు.