అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఎంపిడిఒ
ప్రజాశక్తి-గొలుగొండ:గర్భిణీలు, బాలింతలు రక్తహీన తను అధిగమించడానికి తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారంపై అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఎంపిడిఒ డేవిడ్‌రాజు సూచించారు. మండలంలో లింగంపేట అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. కేంద్రంలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. కేంద్రంలో గర్భిణీలు, బాలింతల వివరాలను కార్యకర్త సత్యవతిని అడిగి తెలుసుకున్నారు. వీరంతా రక్తహీనతను అధిగమించడానికి తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రీస్కూల్ పిల్లలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఏఎన్‌ఎం ఉమా, తదితరులు పాల్గొన్నారు.










