ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని మారుమూల గ్రామమైన ఏడువురాళ్లపల్లి అవుట్ పోస్ట్ పరిధిలో పావురాలు లంక గ్రామంలో పూరిపాకలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రానికి రూ.25వేలు విలువైన సిమెంటు రేకులను శనివారం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ చేతుల మీదుగా పోలీస్ వారి సారధ్యంలో అందజేశారు. చింతూరు సిఐ అప్పలనాయుడు. ఎస్సై శ్రీనివాసరావు పావురాలు లంకలో పూరి పాకలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రానికి సిమెంట్ రేకులను తీసుకువెళ్లి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ అప్పలనాయుడు మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రేకులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీని వల్ల వర్షాకాలంలో చిన్నపిల్లలు కేంద్రానికి క్రమం తప్పకుండా వచ్చే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యను జమాల్ ఖాన్ తెలిపిన వెంబటే స్పందించి తమ అభ్యర్థన మేరకు సహకారాన్ని అందించినందుకు గాను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.










