అంగన్‌వాడీ కేంద్రానికి కుక్కర్ బహూకరణ
ప్రజాశక్తి-కావలి : స్థానిక 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్‌లోని అంగన్‌వాడీ బిట్-2 పాఠశాలకు హ్యాపీ సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్.ఘనీబాషా కుక్కర్‌ను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా సయ్యద్.ఘనీబాషా మాట్లాడుతూ పట్టణానికి మారుమూల ప్రాంతమైన బాలకృష్ణారెడ్డి నగర్‌లో చాలా నిరుపేద పిల్లలు పాఠశాలకు వస్తున్నారని తెలిపారు. కాబట్టి వీరికి మంచి మెరుగైన వసతులు కల్పిస్తే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పుట్టిన రోజు జరుపుకుంటున్న పడకండ్ల.నాగమణి ఎటువంటి ఆర్భాటాలకు వెళ్లకుండా విద్యార్థులకు ఉపయోగపడే ఒక మంచి ఉపయోగకరమైన వస్తువు అందించినందుకు దాత నాగమణిని సంస్థ సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి మాట్లాడుతూ పేద గర్భిణులు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలకు సేవలు అందిస్తున్న వీరికి సదుపాయాలు కల్పించాలని దాతలు విరివిగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో హ్యాపీ సేవాసంస్థ ఉపాధ్యక్షులు విజరు.దేవరకొండ, సలహాదారులు చేవూరు. ప్రభయ్య, సభ్యులు షేక్.షఫీ, షేక్.చాన్‌బాషా, బంకా.క్రాంతి, అంగన్‌వాడీ టీచర్ వి.కామేశ్వరమ్మ, ఆయా ఆర్.సుశీల, విద్యార్థులు పాల్గొన్నారు.










