Jun 23,2023 19:24

అంగన్వాడీ కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న మురళీమోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కింద గర్భిణులు, బాలింతలు, పిల్లలందరికీ పౌష్టికాహారం అందించాలని వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీ మోహన్‌ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని పెద్దబొంపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో సరైన ఆహారం అందిస్తున్నారా, లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్త కేశమ్మ రికార్డులను పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అందరికీ వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం అందించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. గ్రామ నాయకులు గట్టు భీమయ్య, చిన్నబొంపల్లి హుస్సేని, లక్ష్మిరెడ్డి, అంజినయ్య, అంజి పాల్గొన్నారు.