Apr 25,2023 22:49

ఉండూరు అంగన్‌వాడీ కేంద్రంలో తనిఖీలు చేపడుతున్న సిడిపిఒ రమణమ్మ

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, 0-3 ఏళ్ల పిల్లలకు నాణ్యమైన ఆహారం, గుడ్లును సరఫరా చేస్తున్నట్లు సామర్లకోట రూరల్‌ సిడిపిఒ జివి రమణమ్మ చెప్పారు. గడ్డు వెరీ బ్యాడ్‌ అన్న శీర్షికతో ప్రజాశక్తిలో వచ్చిన వార్తా కధనంతో సిడిపిఒ రమణమ్మ, సూపర్‌వైజర్లు స్పందించి మండలంలోని ఉండూరు గ్రామంలోని ఐదు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మి కంగా తనిఖీలు చేసి పరిశీలించారు. కోడి గుడ్లు బరువు, నాణ్యతను పరిశీలించారు. ఒక్కో ట్రేలో 30 గుడ్లు బరువు 1550 నుండి 1650 గ్రాములు ఉన్నట్లుగా గుర్తించా మన్నారు. ప్రతి నెలా మొదటి వారంలో నీలి రంగు, 2వ వారంలో గులాబి రంగు, 3వ వారంలో ఆకుపచ్చ రంగు గుడ్లును సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గుడ్లు గోదాములు నుండి వచ్చే ముందు బరువు, నాణ్యతను సిడిపిఒలు చూసి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నామన్నారు. వేసవి సందర్భంగా అక్కడక్కడ గుడ్లు పాడైవుండొ చ్చని అయితే ఈ తనిఖీల్లో నాణ్యత బాగానే ఉన్నట్లు సిడిపిఒ చెప్పారు. ఈ సందర్భంగా ఆహార నాణ్యతపై తల్లులను, లబ్దిదారులను సమా వేశ పరిచి అవగాహన కల్పిం చారు. గుడ్లు నాణ్యతలో ఎటు వంటి లోపాలు లేవని చెప్పారు. కార్యక్రమంలో సిడిపిఒ వెంట సెక్టార్‌ సూపర్‌ వైజర్‌ ఎస్‌. కుసుమ కుమారి, జిఎం ఎస్‌కెలు కరీమున్నీసా, నాగ లక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్‌లు, తల్లులు పాల్గొన్నారు.