సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి శ్రీదేవి
ప్రజాశక్తి- కలకడ : అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ఎంపిపి శ్రీదేవి రవికుమార్ పేర్కొన్నారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలర్లు ప్రభుత్వం ఇస్తున్న నాణ్యమైన రేషన్ బియ్యాన్ని సకాలంలో పంపిణీ చేయాలని తెలిపారు. ఐసిడిఎస్ రేషన్ ఓల్డ్ స్టాక్ ఏమైనా ఉంటే రిటర్న్ పంపించాలన్నారు. ఎప్పటి స్టాక్ అప్పుడే డిస్ట్రిబ్యూట్ చేయాలని తెలిపారు. రేషన్ సకాలంలో ఇవ్వాలని పేర్కొన్నారు. ఇతర సమస్యలపైన చర్చించామన్నారు. కార్యక్రమంలో తహశీల్దాదర్ ప్రదీప్, డిటి వెంకటరెడ్డి, డీలర్లు పాల్గొన్నారు.










