Sep 29,2022 23:41

అంగన్వాడీలకు సెల్‌ఫోన్లు అందజేస్తున్న ఎంపిపి కారం లక్ష్మి తదితరులు

ప్రజాశక్తి -విఆర్‌.పురం
విఆర్‌.పురం ఐడీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం సరఫరా చేసిన సెల్‌ ఫోన్లను గురువారం స్థానిక రేఖపల్లి ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఆయా సెక్టార్ల సూపర్‌ వైజర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎంపిపి కారం లక్ష్మి, జెడ్పిటిసి వాళ్ల రంగారెడ్డి, సర్పంచ్‌ పూనెం సరోజిని, సిఐటియు నాయకులు వీటిని అంగన్‌వాడీ కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి కారం లక్ష్మి, జెడ్పిటిసి రంగారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు గతంలో ఇచ్చిన ఫోన్లు వరదల వల్ల పాడైపోయాయని, దీంతో ఆన్‌లైన్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విఆర్‌ పురం వరద ప్రభావిత అంగన్వాడీ కేంద్రాల సందర్శనకు విచ్చేసిన ఐసీడీఎస్‌ పీడీకి ఈ సమస్యను తెలియజేయడంతో సెల్‌ ఫోన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.