Jun 08,2023 00:16

మాట్లాడుతున్న వలపర్ల సుబ్బారావు

ప్రజాశక్తి- అద్దంకి : టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త హనువ ూయమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం హేయమైన చర్య అని ఎస్‌సి సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వలపర్ల సుబ్బారావు తెలిపారు. స్థానిక టిడిపి కార్యాలయంలో అద్దంకి నియోజక వర్గ ఎస్‌సి సెల్‌ నాయకులు బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ గతంలో దళిత వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ను నడిరోడ్డుపై పెడరెక్కల విరిచి దారుణంగా హింసించినట్లు తెలిపారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మను అతి కిరాతకంగా ట్రాక్టర్‌తో తొక్కించి పట్ట పగలే హత్య చేసినట్లు తెలిపారు. మనుషులను చంపే రాక్షస రాజకీయ క్రీడ ముఖ్యమంత్రి జగన్‌ ఏకైక లక్ష్యమనితెలిపారు. రాబోవు రోజుల్లో పార్టీలకతీతంగా దళిత సోదరులందరూ ఏకమై జగన్‌ను పాతాళంలోకి తొక్కివేయాలన్నారు. రాష్ట్రంలో దళితులు బతికి బట్ట కట్టే అవకాశమే లేదని ఆయన తెలిపారు. అద్దంకి నియోజకవర్గం అధికార ప్రతినిధి అంక నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ మాట తప్పడం మడమ తిప్పడంతో పాటు సంక్షేమ పథకాల పేరిట దళితులు, ప్రజలందరికీ కూడా బటన్‌ నొక్కి వారి జేబులు నింపుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సెల్‌ ప్రధాన కార్యదర్శి జ్యోతి రామారావు ,దిలీప్‌ ,సామేలు తదితరులు పాల్గొన్నారు.