ప్రజాశక్తి- సీతమ్మధార: నగరంలోని సీతంపేట కనకమ్మవారివీధి అంగన్వాడీ కేంద్రంలోని అల్లరి చేస్తోందన్న కారణంతో మూడున్నరేళ్ల చిన్నారికి అక్కడి ఆయా అగ్గిపుల్లతో చురకలు పెట్టడంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఐసిడిఎస్ పీడీ వెంకటేశ్వరి, సిడిపిఒలు శ్రీలత, రమణకుమారిలో సంభందిత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. బాలిక ముఖంపై ఉన్న చురకలను పరిశీలించి, తక్షణ వైద్యసేవలకు ఆదేశించారు. ఘటనపై 24గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కమిషన్ కార్యాలయానికి నివేదిక పంపాలని కలెక్టర్, ఐసిడిఎస్ పీడీ, ఇతర అధికారులను ఆదేశించారు. పర్యవేక్షక అధికారి ఉమాజానకి, వార్డుల మహిళా సంక్షేమ కార్యదర్శులు కె.విజయ, ఎ.లక్ష్మి, కె.కరిష్మా, ఆర్.సాయిహర్షిత, పి.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.










