Sep 30,2022 23:42

శంకుస్థాపన చేస్తున్న సర్పంచ్‌, ఎంపిటిసి నడిగట్ల రాజు, రామన్న

ప్రజాశక్తి- సీలేరు
జీకే వీధి మండలం దారకొండలో నూతనంగా అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి సర్పంచి నడిగట్ల రాజు, ఎంపీటీసీ రామన్న శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు-నేడు నిధుల్లో భాగంగా రూ.14 లక్షలతో ఈ భవన నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ భవనం పనులు పూర్తయితే అంగన్వాడీ కేంద్రం సమస్య తొలిగిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్ల రామయ్య, మడిగుంట లక్ష్మి, మహిళా పోలీసు దేవి, అంగన్వాడీ టీచర్లు యశోదమ్మ, సత్యవతి అంజలి బురిడీ, సరస్వతి రావు తదితరులు పాల్గొన్నారు.