Jul 27,2023 23:42

అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలిస్తున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరు: ఎస్‌సిఏ గ్రాంట్‌ నిధులతో చేపట్టిన అంగన్వాడీ భవనాలను ఆగస్టు 15 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి వి.అభిషేక్‌ ఆదేశించారు. గురువారం పాడేరు మండలంలోని మినుము లూరు గ్రామంలో నిర్మిస్తున్న అంగన్వాడి భవన నిర్మాణ పనులు పరిశీలించారు. భవన నిర్మాణాల్లో పటిష్టమైన నాణ్యతలు పాటించాలని ఆదేశించారు. నాణ్యమైన టైల్స్‌ ఫ్లోరింగ్‌కి వినియోగించాలని సూచించారు. అనంతరం మినుములూరు నుండి కోడిగుడ్లు గ్రామానికి వెళుతున్న రహదారిలో సిసిడిపి నిధులు రు. 40 లక్షల వ్యయంతో నిర్మించిన వంతెనను పరిశీలించారు. పి.గొందూరు గ్రామంలో నాడు నేడు లో నిర్మిస్తున్న అంగన్వాడి భవన నిర్మాణపు పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ, డివిఆర్‌ ఎం.రాజు, డిఈ అనుదీప్‌ ఐసిడిఎస్‌ పిడి సూర్యలక్ష్మి, సూపర్వైజర్‌ రాజేశ్వరి, మినుములూరు సర్పంచ్‌ లంకెల చిట్టమ్మ పాల్గొన్నారు.