ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని కుంకునూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం-1 నూతన భవన నిర్మాణానికి తహశీల్దార్ వెంకటేష్ నాయక్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సుమిత్రలు శనివారం భూమి పూజ నిర్వహించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు పౌష్టికాహార పదార్థాలను ఇవ్వాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సమతుల్య ఆహారం సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. గతంలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలంలో ఇద్దరు వ్యక్తులు దిబ్బలు వేసుకొని ఉండగా తహశీల్దార్ వారితో మాట్లాడి ఆ స్థలాన్ని అంగన్వాడీ కేంద్రానికి కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ప్రొక్లెయిన్ సహాయంతో ఆ స్థలాన్ని శుభ్రం చేయించి గ్రామస్తుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. విఆర్‌ఒ హరికృష్ణ, వైకెపి హెచ్‌డిసిసి నరసన్న పాల్గొన్నారు.
భూమి పూజ చేస్తున్న తహశీల్దార్ వెంకటేష్ నాయక్










