Sep 02,2023 00:41

 అచ్చంపేట: గర్భిణులు,బాలింతలు పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శిశువు, పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారంటూ ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ ఎస్‌ శ్రీదేవి అన్నారు శుక్రవారం పోషక వారోత్సవాల్లో భాగంగా అచ్చంపేట గ్రామ సర్పంచ్‌ కంబాల వీరబాబు తో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టాలని, మూడ నమ్మకాలు విడనాడాలని పలు రకాల సూచనలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన అంగన్వాడి టీచర్లకు యూనిఫామ్‌ లను గ్రామ సర్పంచి వీరబాబు చేతుల మీదుగా టీచర్లకు అందించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు గ్రామ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు .