అంగన్వాడి కేంద్రాలలో వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్రారంభం
ప్రజాశక్తి - ఆత్మకూరు
ఆత్మకూరు మండలంలో బుధవారం నాడు వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమం మండలంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో ప్రారంభించడం జరిగింది. ఆత్మకూరు పట్టణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ ఆసియా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతులు తీసుకోవడం ద్వారా రక్తం బాగా అభివృద్ధి చెందుతుందని, తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని రహమత్ నగర్ 14, 20, 34 అంగనవాడి కేంద్రాలలో వైయస్సార్ సంపూర్ణ పోషణ ను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భవతులు బాలింతలకు పేస్ యాప్ సహాయంతో వైయస్సార్ సంపూర్ణ పోషణ అందజేయడం జరుగుతుందన్నారు. మూడు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, పావు కేజీ ఆయిల్, 25 గుడ్లు, ఐదు లీటర్ల పాలు, అదేవిధంగా సంపూర్ణ పోషణ కిట్టు అటుకులు కేజీ, రాగి పిండి 2 కేజీలు, బుడ్డల చిక్కిళ్ళు 250 గ్రాములు, బెల్లం 250 గ్రాములు, ఖర్జూరాలు 250 గ్రాములు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటిని గర్భవతులు, తల్లి బిడ్డలు ఉపయోగించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసి డి ఎస్ సూపర్వైజర్లు విజయ కుమారి దేవమ్మ పాల్గొన్నారు కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు బి. విజయలక్ష్మి, శాంత కుమారి, నీరజ, గర్భవతులు, తదితరులు పాల్గొన్నారు.










