Dec 28,2022 23:37

సోమశేఖర్‌ను అభినందిస్తున్న అసోసియేషన్‌ ప్రతినిధులు

ప్రజాశక్తి- విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌, విశాఖపట్నం అధ్యక్షునిగా జోగి సోమశేఖర్‌ నియమితులయ్యారు. బుధవారం కంచరపాలెం జాతీయ రహదారిలోని గిరీశా శ్రీచైతన్య ఇంగ్లీష్‌ మీడియం పబ్లిక్‌ స్కూల్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ సుందర్‌రామ్‌, ప్రధాన కార్యదర్శి జనార్ధన, జివైపిఎస్‌ఎ అధ్యక్షుడు భాస్కరరావు,కౌన్సిల్‌ సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో సోమశేఖర్‌ను అసోసియేషన్‌ విశాఖపట్నం అధ్యక్షునిగా నియమించి, సత్కరించి, అభినందిచారు. ఇదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల అసోసియేషన్‌ అధ్యక్షులుగా తమ్మినేని సింహాచలం, డి.రామకృష్ణారావు, గట్టి పాపారావులను నియమించారు. ఈ సందర్భంగా సోమశేఖర్‌ మాట్లాడుతూ, అసోసియేషన్‌ విశాఖపట్నం శాఖ అభివృద్ధికి, ప్రైవేట్‌ స్కూల్స్‌ ఐక్యతకు కృషి చేస్తానన్నారు. అసోసియేషన్‌ అభివృద్ధికి రాష్ట్ర అధ్యక్షుడు సుందరరావు పలు సూచనలు చేశారు. పలు ఉత్తర్వులకు సంబంధించిన ఫైల్స్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్థన్‌ అందజేశారు. సోమశేఖర్‌కు తమ అసోసియేషన్‌ తరపున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని భాస్కరరావు వెల్లడించారు. అనంతరం విశాఖపట్నం డిఇఒ చంద్రకళ కలిసి, అసోసియేషన్‌ విధివిధానాలను వివరించారు.