Nov 24,2022 21:37

           భీమడోలు:స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రాబ్యాంక్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య జన్మస్థలం గుండుగొలనులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అప్పటి ఆంధ్రాబ్యాంక్‌ యాజమాన్యం ఇచ్చిన హామీలను బ్యాంకును విలీనం చేసుకున్న యూనియన్‌ బ్యాంక్‌ అమలు చేయాలని గుండుగొలను పట్టాభి సీతారామయ్య అభ్యుదయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడిపల్లి కాళీహనుమాన్‌ బాబు, బొల్లిన కోటేశ్వరరావు కోరారు. సంఘం ఆధ్వర్యంలో సీతారామయ్య 142వ జయంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండుగొలను సొసైటీ అధ్యక్షులు వివివి.భాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వక్తలు ఆయన సేవలను కొనియాడారు.