
ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక అనాధ వృద్ధాశ్రమాలయంలో ఆంధ్ర బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి చీరాల ఆంధ్రాబ్యాంక్ యూనిట్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. వృద్ధులకు మధ్యాహ్నం అన్నదానం చేశారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. కార్యక్రమంలో చీరాల యూనిట్ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు జి మధుసూదనరావు, శ్రీనివాసరావు, పిచ్చయ్య, కోట నాగేశ్వరరావు, వెంకటరామయ్య, కాంతారావు, విద్యాసాగర్, చంద్రశేఖర్, ఆశ్రమ కన్వీనర్ సత్రం మల్లేశ్వరరావు, గుత్తి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.