రైతులకు సూచనలు ఇస్తున్న డిడిఎం సుబ్బారెడ్డి
ప్రజాశక్తి - చిప్పగిరి
స్వచ్ఛమైన, కల్తీ లేని ఎరువులు, విత్తనాలను భూమిపుత్ర రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చిప్పగిరి మండల రైతుల ముందుకు తెచ్చినట్లు డిడిఎం సుబ్బారెడ్డి, ఎఫర్ట్ కోఆర్డినేటర్ భానోదయ, కంపెనీ డైరెక్టర్ గోవిందరాజులు తెలిపారు. శనివారం చిప్పగిరిలోని భూమిపుత్ర రైతు ఉత్పత్తిదారుల కంపెనీని డిడిఎం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాబార్డ్ వారి సహకారం సిఎస్‌ఎస్ పథకంలో భాగంగా ఎఫెక్ట్ సంస్థ చిప్పగిరి, నగరడోనా, బెల్డోనా, నేమకల్లులో రైతులకు అందుబాటులో ఉంచారన్నారు. రైతులందరూ భూమిపుత్రకు సంబంధించిన ఎరువులు, విత్తనాలు వేసుకొని మంచి దిగుబడి సాధించాలని కోరారు. సిఇఒ స్వర్ణలత, బెల్డోనా గోవిందు పాల్గొన్నారు.










