అందుబాటులో అన్ని స్టాంపులు
- తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ విజరు కుమార్
ప్రజాశక్తి-తొట్టంబేడు:తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్ని రకాల స్టాంపులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని సబ్ రిజిస్ట్రార్ విజరు కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపులు అందుబాటులో లేవనీ, ప్రజలు పడిగాపులుగాస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దే ఈ-స్టాంపుల విక్రయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒకటి కొన్నా, పది స్టాంపులు కొన్నా గానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.50 యూజర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. యూజర్ చార్జీల భారం ఎత్తివేయాలని కోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలైందని, తీర్పు వచ్చే వరకు ప్రజలు సహకరించాలని కోరారు.










