టిడిపి ప్రత్తిపాడు ఇన్చార్జ్ సత్య ప్రభ
ప్రజాశక్తి - అన్నవరం
ప్రత్తిపాడు నియోజకవర్గం నాయకులకు, అక్కా, చెల్లెళ్ళకు, రాజా అభిమానులకు, ప్రజలకు తన భర్త, మీ అభిమాన నేత, దివంగత నేత వరుపుల రాజా హఠాన్మరణంతో ఆయన ఆశయ సాధన కోసమే మీ ముందుకు వస్తున్నానని ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ అన్నారు. సోమవారం సత్యప్రభ పెద్ద సంకలపూడి నియోజకవర్గంలోని పలు గ్రామాలు మీదుగా రాలిగా ప్రత్తిపాడు హైవే మీదుగా అభిమానులు అన్నవరం చేరుకున్నారు. తొలి పావంచాలి వద్ద సత్యదేవుని దర్శించుకున్నారు అనంతరం స్టేషన్ రోడ్లో ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యప్రభ అభిమానులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై మీ అందరి సూచనలు, సలహాలు తీసుకుని దివంగత నేత రాజా పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తానన్నారు. అందరూ మెచ్చేల సేవలందిస్తానని నన్ను ఆశీర్వదించండి కోరారు. ముందుగా సత్యప్రభ పెద్ద శంకర్లపూడిలోని రాజా స్వగహంలో తొలుతగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించిన అనంతరం ప్రజాక్షేత్రంలోకి భారీ ర్యాలీ చేపట్టారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి కావడంతో పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ స్థానికంగా గల ఎన్టీఆర్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి నేతలు ముదునూరి మురళీ కష్ణంరాజు, పర్వత సురేష్, యాళ్ళ జగదీష్, జల్లిగంపల ప్రభాకరరావు, బుద్ధరాజు గోపిరాజు, వెన్నా శివ, కీర్తి సుభాష్, బద్ది రామారావు, ఉల్లి వీరభద్రరావు, బద్ది రామకష్ణ, కొమ్ముల కన్నబాబు, అధిక సంఖ్యలో అన్నవరం టిడిపి నాయకులు ఎస్ మధుబాబు ఎం నరసయ్య ఆ శ్రీనివాసు కే లోవ దొర బి సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నవరంలో మాట్లాడుతున్న వరుపుల సత్యప్రభ










