ప్రజాశక్తి - వేటపాలెం
ప్రతి ఒక్క విద్యార్థి చదువుతోపాటు చిత్రకళను అలవాటు చేసుకోవాలని వైసిపి ఇన్‌చార్జి కరణం వెంకటేష్ అన్నారు. స్థానిక ఓఆర్ఎస్ పాఠశాల నందు శనివారం శ్రీ శారద చంద్ర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో బొమ్మలు గీయటం ఎలా అనే బుక్స్ పంపిణీ చేశారు. బొమ్మల గీయటం వలన విద్యార్థులకు కలిగే ఉపయోగాలు, నేర్చుకోవలసిన మెళకువలను ఆర్ట్ బార్ డైరెక్టర్ ఎన్ రాజశేఖరరెడ్డి వివరించారు. రచయిత సజ్జా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓఆర్ఎస్ పాఠశాల ఏర్పాటు, చంద్రరెడ్డి కుటుంబానికి ఉన్న అనుబంధం వివరించారు. పాఠశాల పూర్వ విద్యార్థిని పరాల వెంకట సింధుశ్రీ భరతనాట్య ప్రదర్శనతో విద్యార్థులను అలరించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ జెవి సుబ్బయ్య, ఓఆర్ఎస్ పాఠశాల హెచ్ఎం నిరూపమ, పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, పేరెంట్స్ కమిటీ ప్రతినిధి నాయుడు మస్తాన్‌రెడ్డి, ఆర్టిజిఎస్ నాగార్జున, కళాకారులు ఎస్ఎం షరీఫ్ పాల్గొన్నారు.










