రైల్వేకోడూరు : అందరికీ విద్య, ఉపాధికై పోరాటాలకు సిద్ధం కావాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఐటిఐ కాలేజ్ కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ కరువు కాట కాలతో నిరుద్యోగ యువకులు ఐటిఐ పూర్తి చేసుకొని తగిన ఉద్యోగాల్లేక ఉపాధికోసం వలస వెళుతున్నారని అన్నారు. ఇది తెలిసిన పాలక ప్రభు త్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, పేద బడుగు బలహీన వర్గా లకు చెందిన విద్యార్థులకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందిం చడంలో విఫలంవుతున్నారని అన్నారు. కనీస సౌకర్యాలు విద్యా ర్థులకు కల్పించడం లేదన్నారు. కోడూరు ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీ, మంగంపేట మైనింగ్ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిం చాలని అన్నారు. దీనికి ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నిరుద్యోగ యువతకు విద్యార్థులకు గల్ఫ్ దేశాలకు వెళ్ల కుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వేలాది మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉన్నదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నూతన కమిటీని 14 మందిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఐటిఐ కళాశాల అధ్యక్షలుగా భార్గవ్, కార్యదర్శి వినోద్ ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శులు లోకేష్ , నవనీత్, ప్రవీణ్, వెంకట్, ఉదరురెడ్డి, ఉపాధ్యక్షులు సబ్రణమ్యం, జీవన్, పవన్, రణమ, ధనుంజరులను కమిటీ సభ్యులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.










