Oct 03,2023 22:08

అందరికీ సంక్షేమ పథకాలు అందాలి
జెడ్పి ఛైర్మెన్‌ శ్రీనివాసులు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
స్థానిక జెడ్పి ఛైర్మెన్‌ ఛాంబర్‌లో మంగళవారం తంబళ్లపల్లి నియోజకవర్గపు కురబలకోట, పెద్దమండ్యం, తంబళ్లపల్లి, మొలకల చెరువు, బి.కొత్తకోట మండముల జడ్పీటీసీలు, ఎంపిపిలతో జెడ్‌పి ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలుపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం పెండింగ్‌లో వున్న పనులను త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను చిత్తూరు జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధ రెడ్డి , జడ్పీ సీఈఓ ప్రభాకర రెడ్డి ఆదేశించారు.