
ప్రజాశక్తి -తగరపువలస
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగివలస అనిల్ నీరుకొండ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్ర వారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్సార్ విగ్రహం నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని భీమిలి సిఐ కె లక్ష్మణమూర్తి ప్రారంభించారు. ర్యాలీలో అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ సిఇఒ నిరంజన్‌కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధామాధవ్ త్రిపాఠి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత రత్నకుమారి, ఆపరేషన్ జనరల్ మేనేజర్ గణేష్ , సిబ్బంది, ఎన్నారై వైద్య కళాశాల విద్యార్థులు, అనిల్ నీరుకొండ ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు
భీమిలిలో....: అనిల్ నీరుకొండ దంత వైద్యకళాశాల ఆధ్వర్యంలో భీమిలి బీచ్‌లో దంత వైద్య విద్యార్థులు నృత్య ప్రదర్శన ద్వారా చేతి, నోటి శుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. అందరికీ ఆరోగ్యం అంశంపై నాటిక ప్రదర్శించారు. సిహెచ్‌సి దంత వైద్యులు డాక్టర్ డి సిద్ధార్థకుమార్, అనిల్ నీరుకొండ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి , కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం అధికారి డాక్టర్ శివ కుమార్, ఉపాధ్యాయులు డాక్టర్ అవినాష్, పి జివిద్యార్థులు డాక్టర్ వర పసాద్, డాక్టర్ సాయి, దంత వైద్య విద్యార్థులు, వాలంటీర్లు,పాల్గొన్నారు.
ఆనందపురం: సంపూర్ణ ఆరోగ్యానికి మెరుగైన ఆహారపు అలవాట్లే ప్రధానమని ఆనందపురం పిహెచ్‌సి సామాజిక ఆరోగ్యాధికారి పి.సాంబమూర్తి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శొంఠ్యాంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు పి.సన్యాసిరావు, ఆరోగ్య కార్యకర్తలు గోర్లు సత్యవతి, జి.రమేష్, ఆశా కార్యకర్త ఉల్లి భారతి పాల్గొన్నారు.
ఎస్.రాయవరం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని మండలంలో సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు వైద్యాధికారులు శక్తి ప్రియ, వాసంతి తెలిపారు. హెల్త్ అసిస్టెంట్ మలేరియా ఇంఛార్జి నోడల్ అధికారి పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు వడదెబ్బ బారిన పడకుండా బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు టోపీ, జేబు రుమాలు, గొడుగు వంటి వాటిని వాడాలన్నారు. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని, మజ్జిగ, గంజి, కొబ్బరి నీళ్లు, ఓ.ఆర్.ఎస్ ద్రావణం తాగాలన్నారు. జ్వరం తీవ్రత పెరిగితే ఫిట్స్ వంటి లక్షణాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు తంటపురెడ్డి నాగేశ్వరరావు, బి. సత్యనారాయణ, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కశింకోట : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం స్ఠానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కశింకోటలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతిరావు ఆరోగ్యం కోసం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌పిహెచ్‌ఓ సిహెచ్.సత్యనారాయణ, మురళీకృష్ణ, రామూర్తి, సత్యవతి, మున్ని, విజయలక్ష్మి, సుభాని, పారామెడికల్ సిబ్బంది, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.