Oct 05,2023 23:26

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నదే సిఎం వైఎస్‌.జగన్‌ లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ రూరల్‌ మాజీ మంత్రి, కాకినాడ రూరల్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు 49వ డివిజన్‌ గైగోలుపాడులోని పిహెచ్‌సిలో ఐదు రూరల్‌ డివిజన్లకు సంబంధించి నిర్వహించిన శిబిరంలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌ నాగ నరసింహారావు, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ కన్నబాబు మాట్లాడుతూ ఎఎన్‌ఎంలు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది ద్వారా రాష్ట్రంలోని కోటీ 60 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే ద్వారా ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ ఐ. శ్రీను, కడియాల చినబాబు. నాయకులు పాలిక రమణ, పెండ్యాల నాగేశ్వరరావు, నాగబాబు, పాటి సూరిబాబు, లోవరాజు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. యు.కొత్తపల్లి కొత్తమూలపేటలో నిర్వహించిన శిబిరంలో ఎంఎల్‌ఎ పెండెం దొరబాబు, ఆర్‌డిఒ ఎన్‌వివి. సత్యనారాయణ, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నరసింహ నాయక్‌ పాల్గొన్నారు. వైసిపి కారే శ్రీనివాసరావు, సర్పంచులు రావి రమేష్‌, నక్కా మణికంఠ బాబు, ఉమ్మిడి జాన్‌, గుండ్ర రాజబాబు, ఆనాల సుదర్శన్‌, సానా నాగు పాల్గొన్నారు. పెద్దాపురం కట్టమూరులో క్యాంపును హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరు దొరబాబు ప్రారంభించారు. జెడ్‌పిటిసి గవరసాన సూరిబాబు, సర్పంచ్‌ దిమ్మల పుష్పరత్నం,ఉప్పటి ప్రసాద్‌, నల్లల సూర్య కుమారి, ఏలేటి అనంతలక్ష్మి పాల్గొన్నారు. గండేపల్లి ఎర్రంపాలెంలో జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత పౌష్టికాహారం అందించారు. ఎంపిడిఒ రామన్‌, తహశీల్దారు సత్యనారాయణ, ఇఒపిఆర్‌డి మూర్తి, ఎంపిపి దొరబాబు, వైస్‌ ఎంపిపి కుంచే రాజా, పోసిన బాబూరావు, జాస్తి వసంత్‌, సచివాలయం కన్వీనర్‌ నిమ్మలపూడి పాల్గొన్నారు. కోటనందూరు గ్రామంలో స్థానిక సర్పంచ్‌ గర్సింగు శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంపిపి లగుడు శ్రీనివాస్‌ మాట్లాడారు. వైద్యాధికారి ఇందిరా ప్రియదర్శిని, కొరుప్రోలు కృష్ణ, లంక ప్రసాద్‌, చింతకాయల చినబాబు, దార్ల సూర్యచంద్ర, కె.రాము, ఉల్లూరు శ్రీను, జగటాల వీరబాబు, రెడ్డి స్వామినాయుడు, దొడ్డి బాబ్జి పాల్గొన్నారు.