
ప్రజాశక్తి -శింగరాయకొండ
శింగరాయకొండలోని దాచూరి రామిరెడ్డి, అనసూయమ్మ ప్రజా సంఘాల సీఐటీయూ, యూటీఫ్ భవనంలో ఆదివారం మానవత సమావేశము గుంటక రామలక్ష్మమ్మ అధ్యక్షతన నిర్వహించారు.. ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. హరిబాబు మాట్లాడుతూ గత నెలలో మానవత షెడ్డులో, త్రాగునీరు వసతి ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులను అభినందించారు. అదే స్పూర్తితో ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపట్టాలని సూచించారు. కార్యదర్శి కోటపాటి నారాయణ మాట్లాడుతూ మానవత శింగరాయకొండ మండల శాఖ, ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరించాలని కోరారు. మునగపాటి వెంకటరత్నం మాట్లాడుతూ మండల శాఖ షెడ్డు నిర్మించిన స్థలం చుట్టూ, ప్రహరీ గోడ నిర్మాణానికి, వారు, వారి మిత్రులు కలసి రూ.50వేలు విరాళం అందజేస్తామని తెలిపారు. సంసథ మండల శాఖ చైర్మన్ జెట్టి సూర్య చంద్ర శేఖర్ రెడ్డి ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.10 వేలు విరాళం ప్రకటించారు. హాజరైన సభ్యులు కూడా ప్రహరీ గోడ నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యన్నాబత్తిన కొండయ్య, టీ రామూర్తి, పిఎన్ సిఏ విద్యాసంస్థల కళాశాల ప్రిన్సిపాల్ డి నాగేశ్వరరావు, నక్క శ్రీనివాసరావు పాల్గొన్నారు.