
ప్రజాశక్తి- నర్సీపట్నం టౌన్:అందరి సహకారం తోనే పట్టణంలో రోడ్డు విస్తరణ చేపడుతున్నామని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు విస్తరణ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక సంఘంలో భవన యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి భవన యజమానులకు సందేహాలను వాటికి సంబంధించి వివరణ ఇచ్చారు. 90 అడుగుల విస్తరణకు ముందుకొచ్చిన 105 మంది వ్యాపారస్తులు అంగీకారం తెలపడంతో వారికి కతజ్ఞతలు తెలిపారు. రోడ్డు వెడల్పుకు అంగీకారం తెలపని కోర్టుకెళ్లిన వారి విషయంలో ల్యాండ్ అక్విజేషన్ ద్వారా వంద అడుగుల రోడ్డు విస్తరణ చేస్తామని వారికి నగదు రూపంలో చెల్లింపులు చేస్తామని తెలిపారు. బిల్డింగ్ నష్టాన్ని కూడా నగదు రూపంలో చెల్లించడానికి కమిషనర్ చర్యలు తీసుకుంటారన్నారు. అందరి సహకారంతో రోడ్డు విస్తరణ పనులు 21న తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. నర్సీపట్నంలో రోడ్డు విస్తరణ పనులు సజావుగా సాగేందుకు ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రణాళికలు రూపొందించారు పురపాలక సంఘం సమావేశ మందిరంలో వ్యాపారస్తులతో ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ సిబ్బంది, భవన యజ మానులుతో సమావేశమయ్యారు. వ్యాపారస్తుల సందేహాలను నివృత్తి చేశారు. 15 రోజుల్లోపు టిడిఆర్ బాండ్లు ఇచ్చేందుకు అంగీకరించారు. పాత భవనాలను తొలగిం చేటప్పుడు పక్క భవనాలకు ఇబ్బంది కలగకుండా కట్టర్లను వినియోగించాలని తీర్మానించారు.కరెంట్ మీటర్లు మార్పు విషయంలో సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కనకారావు, మునిసిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు స్వామి తదితరులు పాల్గొన్నారు.