Jul 30,2023 22:53

మాట్లాడుతున్న అప్పలనాయుడు

ప్రజాశక్తి- కోటబొమ్మాళి: ఎన్ని చట్టాలున్నా మానవ అక్రమ రవాణా జరుగుతునే ఉన్నాయని, దీనిని ఆరికట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని స్థానిక మండల న్యాయవాదుల సంఘం కార్యదర్శి వెలమల అప్పలనాయుడు పిలుపునిచ్చారురు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కోటబొమ్మాళి ఇన్‌ఛార్జి జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆదేశాల మేరకు స్థానిక మహత్మ జ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞానం సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమరవాణాలలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు ఉంటున్నారని అన్నారు. ఎక్కువగా వలసలకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలకు, వితంతువులు, విడాకులు పొందినవారని, మానసిక వైకల్యం ఉన్నవారిని అన్నారు. దీనిని నివారించేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్ధలు కలిసికట్టుగా పనిచేస్తే మానవ అక్రమ రవాణాను ఆరికట్టవచ్చునన్నారు. ప్రమాద పరిస్థితి ఎదురైనప్పుడు మొబైల్‌ ఫోన్ల ద్వారా ప్రస్తుతం దిశ యాప్‌, సామాజిక మాద్యమాల ద్వారా తక్షణమే రక్షణ పొందవచ్చునని వివరించారు. కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుల్‌ బాలకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీరైకన్నా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.