Oct 26,2023 19:57

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి శ్రీవిద్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ 90 శాతం సంక్షేమ పథకాలు అందజేశామని తెలిపారు. మండలంలోని ఆర్‌అండ్‌బి రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయించామని, పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
ముస్లింల షాదీఖానా కొత్త భవనం ప్రారంభం
పెద్దకడబూరు మండల పరిషత్‌ కార్యాలయం పక్కన సిఎండిఎఫ్‌ నిధులు రూ.35 లక్షలతో నిర్మించిన నూతన షాదీఖానా భవనాన్ని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. మాజీ విఆర్‌ఒ రామలింగారెడ్డితో కలిసి రిబ్బన్‌ కటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్‌ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ముస్లింల షాదీఖానాకు సిఎండిఎఫ్‌ నిధులు రూ.35 లక్షలు మంజూరు చేయించి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. వైసిపి నేతలు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, ఎంపిపి శ్రీవిద్య, జడ్‌పిటిసి రాజేశ్వరి, సర్పంచి రామాంజనేయులు, అధికారులు నాగేశ్వరరావు, వీరేంద్ర గౌడ్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు